హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కార్పొరేట్లు నడిపించే కంపెనీలపై కంటే సామాన్యుడి మీదనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎక్కువగా పన్నులను విధిస్తున్నది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం 21 శాతంగా ఉంటే, కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చే పన్ను ఆదాయం 18 శాతానికే పరిమితం కానున్నది.
సామాన్యుడి కంటే కార్పొరేట్లకే మోదీ ప్రభుత్వం అనుకూలమన్న వాదనలకు బలం చేకూరింది. కాగా, 2019లో దేశీయ కంపెనీల మీద విధించే కార్పొరేషన్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే.