న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై వచ్చే సోమవారం(జూలై 28) లోక్‌సభలో, మరుసటి రోజు(జూలై 29) రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరుగనున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రోజూ జరుగుతున్న రభసకు వచ్చే సోమవారం నుంచి తెరపడే అవకాశాలు మెరుగుపడ్డాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం సమావేశమై సోమవారం జరగనున్న ప్రత్యేక చర్చ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం నుంచి సభ సజావుగా సాగడంపై అధికార, విపక్షాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఉభయ సభలలో వరుసగా ఐదోరోజూ శుక్రవారం ప్రతిపక్షాల రభస కొనసాగింది.