Ayodhya | అయోధ్య: రామమందిర ప్రారంభోత్సవానికి విచ్చేసే వీఐపీలకు నిర్వాహకులు మహాప్రసాదాన్ని అందజేయనున్నారు. నెయ్యి, ఐదు రకాల డ్రై ఫ్రూట్లు, చక్కెర, శనగ పిండితో తయారు చేసిన ఈ మహాప్రసాదాన్ని 20 వేలకు పైగా ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.
ట్రస్ట్ పర్యవేక్షణలో ఐదు వేల కేజీలకు పైగా ఉన్న పదార్థాలతో 200 మంది గుజరాత్‌కు చెందిన భాగవ సేన భారతి గార్వి, సంత్ సేవా సంస్థాన్లు ఈ మహాప్రసాదాన్ని తయారు చేస్తున్నాయి. అలాగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసే సాధువులు, ఇతరులకు బస, భోజన ఏర్పాట్లను చేసినట్టు ట్రస్ట్ తెలిపింది. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని ప్రతి రోజు 5 వేల మందికి అందిస్తామని పేర్కొన్నది.