న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించిందని గురువారం కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో గల సలాల్ – హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు పేర్కొంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ వెల్లడించింది.