National Security Advisory Board | పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దేశ భద్రత విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మోదీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును (National Security Advisory Board) కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్గా ‘రా’ (RAW) మాజీ చీఫ్ అలోక్ జోషీ (Alok Joshi )ని నియమించింది. ఏడుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసింది.
ఈ బోర్డులో త్రివిధ దళాల మాజీ అధికారులు, ఇద్దరు మాజీ ఐపీఎస్లు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సభ్యులుగా చేర్చింది. మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్లు రాజీవ్ సంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి బీ వెంకటేశ్ వర్మను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
Also Read..
Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్ కీలక పాత్ర.. గుర్తించిన ఎన్ఐఏ
Pak Nationals | దేశాన్ని వీడిన 786 మంది పాక్ పౌరులు.. అట్నుంచి 1,376 మంది రాక