Cabinet Meeting | న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ క్యాబినెట్ తొలి సమావేశం సోమవారం జరగనునంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశం ఉంటుంది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.