పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ విడత పోలింగ్ జరిగే 122 నియోజక వర్గాల్లో 3.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విభిన్నమైన సామాజిక వర్గాల ప్రజలు, కుల సమీకరణాలు, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో అధికార, ప్రతిపక్షాలకు పోలింగ్ కీలకంగా మారింది. నితీశ్ మంత్రివర్గంలోని సగం మంది మంత్రులు ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు.
ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందూస్థానీ అవామీ పోటీ చేస్తున్న 6 స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్, సీపీఐ(ఎంఎల్) శాసన సభా పక్ష నేత మెహబూబ్ అలమ్ పోటీ చేసే స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.