SIR | కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టబోతున్నది. ఈ అంశంపై సోమవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నది. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రెస్మీట్లో కమిషన్ అధికారులు తొలి దశ ప్రక్రియ, సర్ నిర్వహించబోయే రాష్ట్రాల గురించి వివరాలను ప్రకటించనున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ముఖ్య ఉద్దేశం ఓటరు జాబితా జాబితాను మెరుగుపరచడం, కొత్త ఓటర్లను చేర్చడమేనని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పేర్ల ధ్రువీకరణ, ఉన్న ఓటర్ల ధ్రువీకరణ, అవసరమైన సవరణలు చేయనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయంగా ఉంటుందని కమిషన్ పేర్కొంది. సర్ కింద కింద ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్లను చేర్చడం జరుగుతుందని ఈసీ పేర్కొంది. అయితే, పూర్తి వివరాలు ఇంకా విడుదల చేయనప్పటికీ, మొదటి దశలో పది నుంచి 15 రాష్ట్రాల్లో సర్ ఉంటుందని అంచనా. ప్రధానంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తున్దని. ఈ రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి ఉన్నాయి. SIRలో ఓటర్ల జాబితా సమగ్ర సమీక్ష, అవసరమైన ఏవైనా సవరణలు చేయనున్నారు. ఈ సర్ కార్యక్రమం ఓటర్ల జాబితా విశ్వసనీయతను పెంచుతుందని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారిస్తుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
సర్ సమయంలో ఈసీ అధికారులు ప్రత్యేకంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఓటర్ల రికార్డులను తనిఖీ చేస్తారు. బెంగాల్లో సర్‌కు ముందు ఎన్నికల కమిషన్ నియామకాలు చేపట్టని.. బూత్-స్థాయి అధికారులకు సహాయం చేయడానికి ఎన్నికల కమిషన్ వలంటీర్లను నియమించవచ్చని ఓ సీనియర్ అధికారి ఆదివారం తెలిపాయి. ప్రతి బ్లాక్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వలంటీర్లను ఎంపిక చేస్తామని, త్వరలో పని ప్రారంభించవచ్చని ఆయన చెప్పారు. అయితే, ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉందని.. వలంటీర్లను నామినేషన్ ఫారాలను పూరించడంలో బీఎల్వోలకు సహాయం చేస్తారని.. అవసరమైతే ప్రత్యామ్నాయంగా నియమిస్తారన్నారు. ఈ వలంటీర్లను ప్రధానంగా 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లలో మోహరిస్తామని.. రాష్ట్రంలో పోలింగ్ బూత్‌ల సంఖ్య ప్రస్తుత 80వేల నుంచి దాదాపు 94వేల వరకు పెరగవచ్చని.. అంటే దాదాపు 14వేల వరకు పెరుగుతుందని అధికారి పేర్కొన్నారు.