Bypolls | 13 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
Bypolls | సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి.
Bypolls | సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. ఏడు రాష్ర్టాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 10న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అధికారులు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగాధ్, మనిక్‌టాలా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్‌లోని డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్, బీహార్‌లోని రూపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మూడు (ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్) రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండగా.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హోష్యార్ సింగ్ ముందంజలో ఉన్నారు. ఇక హమీర్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పిందర్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ ప్రస్తుతం ముందంజలో కొనసాగుతున్నారు. బీహార్‌లోని రూపాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీ(యూ) అభ్యర్థి కళాధర్ ప్రసాద్ మండల్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోని మాంగ్లౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ మహ్మద్ నిజాముద్దీన్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.
Bye Election to Assembly Constituencies: The counting of votes for the 13 Assembly seats spread across 7 states is underway.
As per initial trends by ECI, BJP candidate from Himachal Pradesh’s Dehra Assembly constituency, Hoshyar Singh is currently leading.
Congress… pic.twitter.com/s7MbqjOkKj
— ANI (@ANI) July 13, 2024
Also Read..
Harshika | అగ్ని సాక్షిగా.. భగవాన్ శ్రీకృష్ణుడిని పెళ్లాడిన యూపీ యువతి
Dinner | రాత్రి భోజనం ఎంత తొందరగా తింటే అంత మేలు..
Karnataka | సర్కారు ఖజానా ఖాళీ.. గుదిబండల్లా కర్ణాటక కాంగ్రెస్ గ్యారెంటీలు.. !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

