Dinner | రాత్రి భోజనం ఎంత తొందరగా తింటే అంత మేలు..
రాత్రి పెందలాడే భోజనం తింటే ఆరోగ్యానికి మంచిదని బెంగళూరుకు చెందిన ఫోర్టీస్ దవాఖాన వైద్య నిపుణులు చెబుతున్నారు.
- పెందలాడే భోజనం ఎంతో మేలు
- రాత్రి తొమ్మిదింటికి చేసే భోజనం.. ఆరింటికే చేస్తే ఆరోగ్యానికి మంచిది
- గుండె జబ్బులు, డయాబెటిస్ రావు
- బెంగళూరు వైద్య నిపుణుల వెల్లడి
Dinner | హైదరాబాద్, జూలై 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాత్రి పెందలాడే భోజనం తింటే ఆరోగ్యానికి మంచిదని బెంగళూరుకు చెందిన ఫోర్టీస్ దవాఖాన వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి 9 గంటలకు చేసే భోజనాన్ని సాయంత్రం ఆరింటికే పూర్తి చేయడం వల్ల గుండెపోటు, టైప్-2 డయాబెటిస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
కారణాలు ఇవి..
పడుకొన్నప్పుడు శారీరక శ్రమ ఉండదు. కాబట్టి, నిద్రపోయే ముందు మితంగా ఆహారాన్ని తీసుకోవాలంటారు. ఆ ఆహారాన్ని కూడా నిద్రకు నాలుగైదు గంటల ముందుగానే తీసుకొంటే మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. దీనిద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధం అవుతుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ ముప్పు ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.
రాత్రి తొమ్మిదింటికి బదులు సాయంత్రం ఆరింటికే భోజనం ముగిస్తే.. రక్తపోటు వంటి గుండె జీవక్రియల మీద మెరుగైన ప్రభావాన్ని చూపించి గుండెజబ్బుల ముప్పు కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. భోజనాన్ని ముందే ముగించడంతో రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుందని.. ఇది శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని గుర్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

