న్యూఢిల్లీ: జమ్కుకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంతో పాటు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో నిర్దిష్ట కాలపరిమితి చెప్పలేమని తెలిపారు. అయితే జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా తాత్కాలికమేనని మెహతా ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నామని, కొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో మూడు రకాల ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని సొలిసిటర్ జనరల్ మెహతా కోర్టుకు తెలిపారు. మొదటి, రెండు దశల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, మూడో దశలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించి, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకొంటుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో ఏమైనా కాలపరిమితి ఉన్నదా? అని సీజేఐ ధర్మాసనం ఈనెల 29న విచారణ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించగా మెహతా సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు నకిలీ సుప్రీంకోర్టు వెబ్సైట్ సృష్టించారు. దీనిపై అప్రమత్తమైన సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఇలాంటి వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వెబ్సైట్ ద్వారా పౌరుల ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఫోన్, పాన్ నెంబర్లు వంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వెబ్‌సైట్‌కు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో తమ వివరాలను తెలియజేయవద్దని విజ్ఞప్తి చేశారు.