న్యూఢిల్లీ, జూన్ 20: యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ కేసులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యా శాఖ సూచన మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్డీలో ఎంపిక కోసం యూజీసీ-నెట్ 2024ను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జూన్ 18న దేశ వ్యాప్తంగా రెండు షిఫ్టులలో నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన పరీక్ష పేపర్ అంతకు ముందు రోజే డార్క్ నెట్లో ప్రత్యక్షమై 5-6 లక్షలకు అమ్మినట్టు నిర్ధారిత సమాచారం అందడంతో యూజీసీ ఆ పరీక్షను రద్దు చేసింది.