Armed Forces : భారత సాయుధ బలగాలు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ‘కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ – 2025 (Combined Commanders’ Conference (CCC) – 2025) నిర్వహించనున్నాయి. ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు ఈ కాన్ఫరెన్స్ కొనసాగనుంది. ‘ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ – ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్ (Year of Reforms – Transforming for the Future)’ అనేది కాన్ఫరెన్స్ థీమ్‌గా నిర్ణయించారు. భారత రక్షణ శాఖ (Ministry of Defence) ఈ విషయాన్ని వెల్లడించింది.
‘ఈ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ – 2025’ ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ సహాయ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్, రక్షణ శాఖ కార్యదర్శి తదితరులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. అదేవిధంగా త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు.