Amit Shah | ఆర్టికల్ 370 (Article 370) రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ (one Constitution – one flag) అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. అక్కడ ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు చెప్పారు. రాజ్యసభ (Rajya Sabha)లో హోంశాఖ (Ministry of Home Affairs) పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా షా మాట్లాడారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పనితీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయి. అయితే, తమ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. జమ్ము కశ్మీర్లో ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2004-2014 మధ్య ఈ ప్రాంతంలో 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. 2014 నుంచి 2024 మధ్య ఆ సంఖ్య 2,242కి తగ్గింది. మోదీ పాలనలో కశ్మీర్లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా అణచివేశాం.
2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రఘటనలే కాకుండా రాళ్ల దాడులు కూడా తగ్గాయి. కశ్మీర్ యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకూ యువతకు 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. పెట్టుబడులు కూడా పెరిగాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే రూ.12,000 కోట్ల విలువలైన పెట్టుబడులు వచ్చాయి. రూ.1.1 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు కశ్మీర్లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయి’ అని అమిత్ షా తెలిపారు.
Also Read..
Deportation | త్వరలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక.. ప్రకటించిన కేంద్రం
Delhi judge | ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం