Deportation | తాను గెలిస్తే అక్రమ వలసదారులను (illegal immigrants) దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పలు దేశాలకు చెందిన వారిని ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వందలాది మంది భారతీయులను కూడా స్వదేశానికి తరలించారు.
యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న 300 మందికిపైగా భారతీయుల్ని ట్రంప్ సర్కార్ ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది. తాజాగా మరో 295 మంది భారతీయుల్ని వెనక్కి పంపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Indian Govt) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అక్రమ వలసల అంశంపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ‘జనవరి 2025 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 388 మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది’ అని రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
Also Read..
Delhi judge | ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం
Passenger found dead | విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి