Passenger found dead | విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు మృతి (Passenger found dead) చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం (AI2845) శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లింది. అయితే, లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Chaudhary Charan Singh International Airport) 8:10 గంటలకు ల్యాండ్ కాగానే ప్రయాణికులంతా దిగేందుకు సిద్ధమయ్యారు.
అయితే, విమానంలోని ఓ ప్రయాణికుడు మాత్రం చలనం లేకుండా తన సీట్లోనే ఉన్నాడు. దీంతో సిబ్బంది ఆ ప్రయాణికుడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో విమానంలో ఉన్న వైద్యులు ఆ ప్రయాణికుడిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడిని అసిఫుల్లా అన్సారీగా గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసిఫుల్లా మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Bill Gates | సచిన్‌తో కలిసి వడాపావ్ తిన్న బిల్‌గేట్స్.. వీడియో వైరల్
PM Modi | రెండేళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని మోదీ.. రూ.258 కోట్ల ఖర్చు : కేంద్రం వెల్లడి
Tungabhadra | కర్ణాటక రైతుల జల చౌర్యం.. తుంగభద్రలోకి వచ్చిన నీరు వచ్చినట్టు తోడేస్తున్నరు