Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. తాజాగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తో బిల్‌గేట్స్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ముంబై ఫేమస్ స్నాన్ వడాపావ్ (Vada Pav)ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బిల్‌గేట్స్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘పని చేయడానికి ముందు ఓ స్నాక్ బ్రేక్’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో సచిన్, బిల్‌గేట్స్ ఇద్దరూ ఓ బెంచ్‌పై కూర్చొని వడాపావ్‌ను ఎంజాయ్‌చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Tungabhadra | కర్ణాటక రైతుల జల చౌర్యం.. తుంగభద్రలోకి వచ్చిన నీరు వచ్చినట్టు తోడేస్తున్నరు
PM Modi | రెండేళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని మోదీ.. రూ.258 కోట్ల ఖర్చు : కేంద్రం వెల్లడి
PR Machine | మోదీ వర్సెస్ మస్క్.. మధ్యలో గ్రోక్