శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 12:40:11

కుల్గాం బీజేపీ నేత‌‌ల హ‌త్య‌లో ముష్క‌రుల హ‌స్తం: క‌శ్మీర్ డీజీపీ

కుల్గాం బీజేపీ నేత‌‌ల హ‌త్య‌లో ముష్క‌రుల హ‌స్తం: క‌శ్మీర్ డీజీపీ

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌ల హత్య‌లో ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉన్న‌ద‌ని పోలీసులు ద్రువీక‌రించారు. హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ వారిని గుర్తించామ‌ని, దర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని జ‌మ్ముక‌శ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. వారిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని వెల్ల‌డించారు. 

గ‌త గురువారం (అక్టోబ‌ర్ 29న) సాయంత్రం కుల్గాం జిల్లాలో బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం)కు చెందిన ముగ్గురు నేతలైన ఫిదా హుస్సేన్, ఉమర్‌ హజం, ఉమర్‌ రషీద్ బేగ్‌ను దుండ‌గులు కాల్పిచంపారు. కాగా, ఈ ఘటనకు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన‌ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌) బాధ్యతగా ప్రకటించుకుంది. జ‌మ్ములో గ‌త‌ జూన్‌ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు.