విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి | రాజస్థాన్ కురు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి నలుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు.

జైపూర్ : రాజస్థాన్ కురు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి నలుగురు బాలురు మృత్యువాతపడ్డారు. మృతులంతా 8-15 ఏళ్లల లోపువారేనని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన భలేరి ప్రాంతంలో జరిగిందని పేర్కొన్నారు. పిల్లలు స్నానానికి చెరువు వద్దకు వెళ్లగా.. ఓ బాలుడు నీటిలో పడిపోయాడు. రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు సైతం అందులోనే పడిపోయారని తెలిపారు. ఇంటికి దగ్గరగా ఉండడంతో వారంతా స్నానాలు చేసేందుకు చెరువు వద్దకు రాగా.. ఘటన జరిగిన సమయంలో వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యారు. చెరువు వైపుగా వెళ్లిన పలువురు పిల్లల మృతదేహాలను చూసి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబాలకు అప్పగించారు. ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
సముద్ర సేతు-2 వేగవంతం
సన్‌రైజర్స్ 30 కోట్ల విరాళం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- children drown
- Died
- pond
- Rajasthan
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

