Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కుల్గాం (Kulgam) జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్ట్ (Terrorist) హతమయ్యాడు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లాలోని గుడార్ అటవీ (Gudar forest) ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించాయి. భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వారిపై ఎదురు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సుమారు ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read..
Ganesh Visarjan | గణేశ్ శోభయాత్రపై రాళ్లు.. మద్దూర్లో తీవ్ర ఉద్రిక్తత
Domestic Violence | బీజేపీ ఎంపీ సోదరికి అత్తింట్లో వేధింపులు.. అందరిముందే కొట్టిన మామ
Lunar Eclipse | కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎరుపు వర్ణంలోకి మారిన చంద్రుడు.. Photos