లక్నో: ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు. అత్తింటి వారి అకృత్యాలను నిలదీసినందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా వదిలించుకోవాలని.. ఆమెను బజార్లోకి గుంచి అందరూ చూస్తుండగా కర్రలు, లాఠీలతో కొడుతున్నారు. గత కొన్ని నెలలు ఇది జరుగుతున్నా చుట్టుపక్కల వారు చోధ్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోలేకోకపోవడం గమనార్హం. వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు కేసు పెట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ (Mukesh Rajput) సోదరి.. రీనా రాజ్‌పుత్‌కు 17 ఏండ్ల క్రితం ఇటా జిల్లా రాణి అవంతిబాయి నగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ కూతురు ఉన్నది. అయితే గత కొంతకాలంగా రీనా రాజ్‌పుత్‌పై అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాలనుకున్నారు. ఇందులో భాగంగా ఆమె స్నానం చేస్తుండగా మామ, బావ కలిసి రహస్యంగా వీడియో తీశారు. గుర్తించిన ఆమె వారిని ప్రశ్నించడంతో.. మామ ఆమెను తుపాకీతో కొట్టాడు. అతనినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, తన బావమరిది వీధిలో ఇనుప రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టాడు. ఒపిక నశించిన ఆమె వారి అకృత్యాలను నిలదీయడంతో ఆగ్రహించిన మామ.. ఇంట్లో నుంచి బయటకు గుంజుకొచ్చి కర్రతో తీవ్రంగా కొట్టారు.
దీంతో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించారు. లాఠీలు, కర్రలతో తరచూ కొడుతున్నారని, తన కూతురిని కూడా హింసించారని తన ఫిర్యాదులు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని, భవిష్యత్‌లో ఎలాంటి హానీ జరగకుండా చూడాలని అధికారులను కోరారు. కాగా, బాధితురాలు అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
भाजपा सांसद की बहन का आरोप है नहाते समय ससुर और देवर वीडियो बना रहे थे! जब मैंने विरोध किया तो गालियां देने लगे। पिटाई शुरू कर दी !!
यूपी के फर्रुखाबाद से भाजपा सांसद मुकेश राजपूत की बहन को उनके ससुर और देवर ने बीच सड़क पर बेरहमी से पीटा है। कासगंज में घर के बाहर ससुर ने बहू को… pic.twitter.com/qyFMDyk72e
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) September 7, 2025