Jawan Suicide | సాంబా/జమ్ము: తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సరోజ్ ఔట్‌పోస్టు వద్ద సెంట్రీ విధులు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తును బట్టి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.