తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత జస్టిస్ సుజయ్ పాల్ తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తారు.
- బాంబే హైకోర్టుకు ట్రాన్స్ఫర్
- సుప్రీంకోర్టు జడ్జీగా వినోద్ చంద్రన్
- కేంద్రానికి కొలీజియం సిఫారసులు
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత జస్టిస్ సుజయ్ పాల్ తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తారు. మరోవైపు, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే వినోద్ చంద్రన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం సమావేశమైంది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
జస్టిస్ మన్మోహన్ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడంతో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విభూ బఖ్రూ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్ కర్దక్ ఈటే, జస్టిస్ మృదుల్ కుమార్ కలితాను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కూడా కొలీజియం సిఫారసు చేసింది.
2011 నవంబర్ 8న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ చంద్రన్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. ఈ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరుగుతుంది. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్ ఈ నెల 3న పదవీ విరమణ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

