Students | బోర్డు పరీక్షలకు ముందు 12వ తరగతి విద్యార్థులు హైఎండ్ లగ్జరీ కార్లతో భారీ పరేడ్ (luxury car rally) నిర్వహించారు. విద్యార్థులంతా బ్లేజర్స్ ధరించి దాదాపు 35 కార్లతో భారీ ర్యాలీగా పాఠశాలకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గుజరాత్ రాష్ట్రం సూరత్ (Surat)లో ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు ముందు ఫేర్వెల్ (Farewell) పార్టీ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా దాదాపు 35 హై ఎండ్ లగ్జరీ కార్లతో పరేడ్ నిర్వహించారు. బెంజ్, ఆడీ, స్కోడా, బీఎమ్‌డబ్ల్యూ, పోర్చే, రేంజ్ రోవర్, ఫార్చూనర్, మహీంద్రా స్కార్పియో వంటి ఖరీదైన కార్లలో వెళ్తూ సందడి చేశారు. సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు.
ఈ తతంగాన్నంతా చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
સુરતમાં આ તે કેવું ફેરવેલ…?, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નીકળ્યા લગઝરી કારના કાફલા સાથે…..#surat #suratcity #suratcitypolice #suratpolice #student #students #car #cars #trending #tranding #breakingnews #viralnews #newsupdate #viral #tras #vehicle #shandarrajkot pic.twitter.com/4alFHamuj1
— Shandar Rajkot (@ShandaRajkot) February 10, 2025
Also Read..
Rahul Gandhi | ఆర్మీపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Ram Temple Priest | అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత