L And T Chairman | సంక్షేమ పథకాల వల్లే కార్మికుల్లో పనిచేయాలన్న ఆసక్తి తగ్గిపోతోంది.. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలు
L And T Chairman | ఎల్ అండ్ టీ చైర్మన్ (L&T chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
L And T Chairman | ఎల్ అండ్ టీ చైర్మన్ (L&T chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు.. ఆదివారాలూ పనిచేయండి’ అంటూ గత నెలలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వారానికి 90 గంటలు పనిచేయాలని తన ఉద్యోగులకు (employees) సూచించారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఆయన కార్మికులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే దీనికి కారణమని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన కార్మికుల కొరతపై మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య తగ్గడం పెద్ద సమస్య కాదని, కానీ కార్మికుల లభ్యత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
‘ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వలసలు వెళ్లడానికి ఇష్టపడట్లేదు. బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణమయ్యి ఉండొచ్చు. వాటి వల్లే వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలన్న ఆసక్తి తగ్గిపోతోంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం కార్మికుల్లోనే కాదు, వైట్ కాలర్ ఉద్యోగాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని అన్నారు. తాను ఎల్ అండ్ టీలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు మా బాస్ ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని తనతో చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తిని ఎవరైనా అలా అడిగితే ‘బై’ అంటూ వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
కాగా, వర్క్ బ్యాలెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తన ఉద్యోగులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని (90-hour work week) సూచించారు. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలన్నారు. ఎంతసేపు అలా భార్యను చూస్తూ ఉండిపోతారు..? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కవ సమయం ఉంటామని భార్యలతో చెప్పాలని ఉద్యోగులతో అన్నారు. ‘ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నా. మీతో ఆదివారాలూ పనిచేయించగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నాను’ అని ఉద్యోగులతో అన్నారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.
Also Read..
Rahul Gandhi | ఆర్మీపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Chiranjeevi | వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు.. నెట్టింట ట్రోలింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

