PM Modi: మోదీ ప్రయాణించే విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే ఛాన్స్.. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్టు
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
బెంగుళూరు: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించే విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఫిబ్రవరి 11వ తేదీన ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఆ వార్నింగ్ కాల్ వచ్చింది. సమాచారం చాలా సీరియస్‌గా ఉన్నట్లు గ్రహించిన పోలీసుల.. కేసును తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు.
ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు కూడా పోలీసులు ఈ సమాచారాన్ని చేరవేశారు. చాలా లోతుగా దర్యాప్తు చేపట్టారు. ముంబై పోలీసు కంట్రల్ రూమ్‌కు ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చెంబూరు ప్రాంతం నుంచి అతన్ని అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించామని ముంబై పోలీసులు చెప్పారు.
On 11th February, a call was received at Mumbai Police Control Room warning that terrorists may attack PM Modi’s aircraft as he was leaving on an official visit abroad. Considering the serious nature of the information, the Police informed other agencies and began an…
— ANI (@ANI) February 12, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

