Chiranjeevi | వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు.. నెట్టింట ట్రోలింగ్
Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. ఒక సినిమా వేడుకలో ఆయన మాట్లాడుతూ.. వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Chiranjeevi Sexiest Comments | మెగాస్టార్ చిరంజీవిపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందానికి సినిమా విజయవంతం అవ్వాలని ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
అయితే ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ… తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు, నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా, చుట్టూ ఆడవాళ్ళతో ఉన్నట్లు అనిపిస్తుంది. చరణ్ ఇప్పటికైన ఒక అబ్బాయిని కను. నా వారసత్వం కొనసాగాలంటే మనువడు కావాలి. కానీ చరణ్కి మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉందంటూ చిరంజీవి చెప్పుకోచ్చాడు. అయితే చిరు చేసిన సెక్సిస్ట్ (లింగ సంబంధ) వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 2025లో కూడా వారసుడు కావాలని కోరుకుంటున్నారు ఇలాంటి మనుషులు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
He Said I Don’t Want Another Girl Child, So Disrespectful To Women
I’m Sincerely Requesting @narendramodi Sir To Please Ban @KChiruTweets Padmabhusan & Vibhushan Awards Immediately To Save Our Indian Culture & Femininity 🙏🏻#ChiranjeeviMisogynyUnmasked pic.twitter.com/5IuWcyHXaM
— Smudge (@Okkkaduu) February 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

