Digital School | సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ దాని మీద ఒక ఒపినియల్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా పాఠాలు చెప్పరు.. సరిగ్గా వసతులు ఉండవు.. అంటూ ఏదేదో చెబుతారు. కానీ.. ఈ ప్రభుత్వ పాఠశాలను చూస్తే.. ఆ మాట ఇంకెప్పుడూ అనరు. మా పిల్లలను ఇదే స్కూల్లో చదివిస్తాం అని ఆ స్కూల్ ముందు క్యూ కడతారు. ఎందుకంటే.. ఆస్కూల్ ఇప్పుడు డిజిటల్ స్కూల్. ఆ స్కూల్లో ఉండే వసతులు ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా ఉండవు. కానీ.. ఇదంతా చేసింది ప్రభుత్వం కాదు.. అదే పాఠశాలలో టీచర్లుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు. వాళ్లే ఆ స్కూల్‌ను డిజిటల్ స్కూల్‌గా మార్చారు.
దాని కోసం ఆ స్కూల్ హెడ్మాస్టర్, మరో ఇద్దరు టీచర్లు నడుం బిగించారు. తమ జీతాల్లో కొంత భాగాన్ని స్కూల్ అభివృద్ధి కోసం వెచ్చించడం ప్రారంభించారు. చివరకు సక్సెస్ అయ్యారు. అక్కడి వాళ్లు ఆ స్కూల్ గురించి మాట్లాడుకునేలా చేశారు.
ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది అంటారా. మధ్య ప్రదేశ్‌లోని ఛింద్వారాకు దగ్గర్లో ఓ గిరిజన గ్రామంలో ఉంది ఆ స్కూల్. అది పేరుకు ప్రభుత్వ పాఠశాల అయినా.. గిరిజన గ్రామంలో ఉండటంతో అక్కడ అరకొర వసతులే ఉండేవి. అదే స్కూల్లో హెడ్ మాస్టర్‌గా ఉన్న అనిల్ కొతెకర్, మరో ఇద్దరు టీచర్లు రఘునాథ్, రాము పవార్.. ఈ ముగ్గురు ఆ స్కూల్‌కు మౌలిక వసతులు, ఇతర వసతులు కల్పించాలని అనుకున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనుకున్నారు. గత 5 ఏళ్ల నుంచి తమ జీతంలో ఒక శాతాన్ని స్కూల్ కోసం ఖర్చు పెట్టడం ప్రారంభించారు. దాన్ని డిజిటల్ స్కూల్‌గా మార్చారు.
పిల్లలకు చదువుకోవడం మంచి మంచి వాతావారణం ఉండాలి. అన్ని సదుపాయాలు ఉండాలి. కానీ.. ఈ స్కూల్లో అవేమీ లేవు. దీంతో పిల్లలు ఈ స్కూల్‌కు రావడం మానేశారు. అందుకే.. మేము నడుం బిగించాం. స్కూల్‌కు కావాల్సిన అన్ని వసతులు కల్పించాం. ఇప్పుడు స్కూల్లో స్మార్ట్ టీవీ ఉంది, ప్రొజెక్టర్, లౌడ్ స్పీకర్, లాప్టాప్, టాబ్లెట్ అన్నీ ఉన్నాయి. ప్రస్తుత ఈ స్కూల్ డిజిటల్ స్కూల్‌గా అవతరించింది.. అని ఆ స్కూల్ దశదిశను మార్చిన టీచర్లు చెప్పుకొచ్చారు.
ఈ స్కూల్ గురించి ఛింద్వారాలో తెలియడంతో వేరే స్కూళ్ల నుంచి టీచర్లు వచ్చి డిజిటల్ మోడ్‌లో పిల్లలకు ఎలా విద్య అందిస్తున్నారో చూసి వెళ్తున్నారు. పిల్లల సంఖ్య కూడా పెరిగింది. చింద్వారాలో ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడి మరీ.. ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చెరుకురసంతో చాయ్.. పానీపూరీ, జిలేబీ కూడా.. ఇంజనీర్ సరికొత్త ఆలోచన అదుర్స్
ప్లాస్టిక్ వేస్ట్‌తో అద్భుతమైన బ్యాగులు, మ్యాట్స్.. యువతి సరికొత్త ఆలోచన ఆదుర్స్