Inspirational Story | ప్లాస్టిక్ వేస్ట్‌తో అద్భుతమైన బ్యాగులు, మ్యాట్స్.. యువతి సరికొత్త ఆలోచన అదుర్స్
Inspirational Story | ఇప్పుడు అదే చరకాను ప్లాస్టిక్ వేస్ట్ నుంచి అద్భుతమైన బ్యాగులు, మ్యాట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తోంది ఓ యువతి. తన పేరు అమిత దేశ్‌పాండే

Inspirational Story | మీకు చరకా గురించి తెలుసా? అప్పట్లో జాతిపిత మహాత్మాగాంధీ చరకాను వాడారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ఆయన అప్పుడు వాడితే.. ఇప్పుడు అదే చరకాను ప్లాస్టిక్ వేస్ట్ నుంచి అద్భుతమైన బ్యాగులు, మ్యాట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తోంది ఓ యువతి. తన పేరు అమిత దేశ్‌పాండే. పూణెకు చెందిన అమిత సాఫ్ట్వేర్ ఇంజినీర్. తనకు రీచరకా అనే ఓ సంస్థను స్థాపించి.. ప్లాస్టిక్ వేస్ట్‌తో అద్భుతమైన వస్తువులను తయారు చేస్తోంది.

ప్లాస్టిక్ వేస్ట్‌ను చరకా సాయంతో దారంలా సాగదీస్తుంది. దాన్ని దారంలా తయారు చేసి.. ఆ తర్వాత హ్యాండ్లూమ్ మిషన్ల ద్వారా బ్యాగులు, మ్యాట్స్, ఇతర వస్తువులను తయారు చేస్తోంది.
గత సంవత్సరం మొత్తం 7 లక్షల ప్లాస్టిక్ ప్యాకెట్స్‌ను ఉపయోగించి బ్యాగులు, ఇంటి డెకరేషన్ వస్తువులు, బాస్కెట్లు, టేబుల్ మ్యాట్స్ తయారు చేసింది అమిత.
Inspirational Story | లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి
అమిత తన చదువు పూర్తి కాగానే ఐటీ సెక్టార్లో కొన్నేళ్లు పనిచేసింది. ఆ తర్వాత యూఎస్‌లో మాస్టర్స్ చేసింది. తను ఏం చేసినా.. ఏం చేస్తున్నా.. ఎప్పుడూ పర్యావరణం గురించి.. ప్లాస్టిక్ వేస్ట్‌ను ఎలా రీయూజ్ చేయాలనే ఆలోచిస్తూ ఉండేది. అదే ఆలోచన తనను రీచరకా అనే సంస్థ స్థాపించేలా చేసింది. ఇప్పుడు తనతో పాటు మరో 15 మంది పని చేస్తున్నారు. పూణెలోనే కంపెనీల నుంచి.. ఇతర షాపుల నుంచి ప్లాస్టిక్ వేస్ట్‌ను వీళ్లు కలెక్ట్ చేసి.. దాన్ని దారాల్లా చరకా ద్వారా మార్చి అందమైన బ్యాగులు తయారు చేస్తారు. పూణెతో పాటు తనకు దాద్రా నగర్ హవేలీలో మరో యూనిట్ కూడా ఉంది. అక్కడ కూడా ప్లాస్టిక్ వేస్ట్‌ను ఉపయోగించి పలు వస్తువులను తయారు చేస్తారు.

అమిత తయారు చేసిన వస్తువులను ఎక్స్పో, ఎగ్జిబిషన్లలో అమ్మకానికి పెడతారు. ఈ వస్తువులను అమ్మడం కోసం అమిత ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ప్లాస్టిక్ వేస్ట్‌తో ప్రపంచమంతా సతమతమవుతున్న ఈరోజుల్లో ప్లాస్టిక్ వేస్ట్ నుంచి అద్భుతమైన వస్తువులను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అమిత.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బీటెక్ చాయ్ చమక్కులే వేరు భాయ్.. కోవిడ్‌తో కొలువులు పోతే ఏకంగా యజమానులయ్యారు
తెలంగాణలోని నిగూఢ రత్నాలు.. ఈ దర్శనీయ ప్రదేశాలు
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

