చెన్నై : బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న క్రమంలో స్కూల్ టీచర్ బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఐపీఎస్ అధికారి ఆర్. స్టాలిన్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లను ఈ క్లిప్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ వైరల్ వీడియోలో టీచర్ స్కూల్ బాలికను ఈ కీలక టాపిక్‌పై అవగాహన కల్పిస్తుండటం కనిపిస్తుంది. ఈ ఫుటేజ్‌లో ఏది సరైన స్పర్శ ఏది చెడు ఉద్దేశంతో కూడుకున్నదో సదరు టీచర్ బాలికకు వివరిస్తుంది. టీచర్ వివరించిన తీరుకు తగినట్టుగా బాలిక ప్రతిస్పందించడం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
It’s needed for every child…
Good touch 👍& Bad touch 👎
Excellent message 👏 pic.twitter.com/ueZDL7EDTx— Dr. R. Stalin IPS (@stalin_ips) September 25, 2023
లైంగిక వేధింపులు, ముప్పు నుంచి ఇలాంటి శిక్షణ బాలికలు తమను తాము కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగత హద్దులు, భద్రతపై చిన్నారులకు ఇలాంటి శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు నెటిజన్లు ఉపాధ్యాయురాలి చొరవను ప్రశంసించారు.
Read More :