IT Rides | కాంగ్రెస్ ఎంపీ బంధువుల కంపెనీల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు.. మరో 19 బ్యాగుల్లో నగదు స్వాధీనం
IT Rides | జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు (IT Rides) కొనసాగుతున్నాయి. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
IT Rides | జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ధీరజ్ సాహూ (Dheeraj Sahu) బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు (IT Rides) కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ సోదాల్లో రాంచీలోని ధీరజ్ సాహూకు చెందిన ఆఫీసులో మరో మూడు బ్యాగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒడిశాలో జరుగుతున్న దాడుల్లో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బంటీ సాహూ అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 19 బ్యాగుల్లో సొమ్మును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన బ్యాగుల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగానే నగదు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒడిశాలో దాడులు జరుగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని లెక్కపెట్టేందుకు అధికారులు మూడు డజన్ల కౌంటింగ్ మెషీన్లను వాడుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపుగా రూ.300 కోట్ల మేర సొమ్మును పట్టుబడినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మొదట డిసెంబర్ 6న డిస్టిలరీలపై దాడులు చేపట్టారు. ఆ తర్వాత బల్దియో సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ 156 బ్యాగుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని టిట్లాగఢ్, సంబల్పూర్, సుందర్‌గఢ్, భువనేశ్వర్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రూర్కెలా, రాయగడలో కొందరు మద్యం వ్యాపారులకు సంబంధించిన ఆస్తులపై కూడా సోదాలు జరిగాయి.
Also Read..
PM Modi | ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతలు ఎవరంటే..?
NIA Raids | మహారాష్ట్ర, కర్ణాటకలో ఏకకాలంలో 41 చోట్ల ఎన్ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్
KCR | బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

