PM Modi | ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతలు ఎవరంటే..?
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా.. 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా.. 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
యుఎస్‌కు చెందిన మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో.. భారతదేశంలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. 18 శాతం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరో ఆరు శాతం మంది ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఇక మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికో ప్రజలు 66 శాతం మంది ఆమోదిస్తుండగా.. 29 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఆండ్రెస్ తర్వాత స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వాన్ని 58 శాతం ప్రజలు కోరుకుంటుండగా.. 28 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.
ఈ సర్వేలో బ్రెజిల్‌కు చెందిన లులా డ సిల్వా, ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇటలీ మాజీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ సర్వేలో ఆరో స్థానంలో నిలిచారు. 41 శాతం మంది ఇటలీ వాసులు ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బెల్జియంకు చెందిన అలెగ్జాండర్ డి క్రూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరూ 37 శాతం ప్రజామోదంతో 7, 8 స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు 31 శాతం, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి 25 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు కేవలం 24 శాతం మాత్రమే ఆమోదం లభించింది.
Also Read..
NIA Raids | మహారాష్ట్ర, కర్ణాటకలో ఏకకాలంలో 41 చోట్ల ఎన్ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్
PM Modi | సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
KCR | బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

