liquor dispensing machine | డబ్బు విత్ డ్రా (Money Withdraw) చేసుకునేందుకు ఏటీఎం (ATM) మెషీన్ల వద్దకు జనం పరుగులు తీయడం సర్వసాధారణమే.. కానీ, చెన్నై (Chennai) లో మాత్రం మందుబాబులు ఏటీఎం ముందు క్యూ కట్టే రోజులు వచ్చేశాయి. ఎందుకనే కద మీ సందేహం..! ఏమీ లేదండీ.. చెన్నైలో కొత్త ఏటీఎం మెషీన్లు వచ్చేశాయి. కాకపోతే వాటిలో డబ్బుకు బదులు మద్యం తీసుకోవచ్చు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (Tasmac) చెన్నై నగరంలోని ఓ మాల్ వెలుపల ఆటోమేటిక్ లిక్కర్ డిస్పెన్సింగ్ మెషీన్ (automatic liquor dispensing machine)ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషీన్లను మందుబాబుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఎనీ టైం మద్యం మెషీన్ల నుంచి మందు కొనుగోలు చేసుకోవచ్చు. మనం డబ్బు విత్ డ్రా చేసుకునే విధంగానే ఈ మెషీన్లు పనిచేస్తాయి. దీని వినియోగం కూడా చాలా సులభమే. మెషీన్లలో ముందుగా స్క్రీన్ పైన కనిపించే బ్రాండ్లలో మనకు కావాల్సిన బ్రాండ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వెంటనే దాని ధర డిస్ప్లేలో కనిపిస్తుంది. ఆ మొత్తాన్ని డిజిటల్ (ఆన్ లైన్) రూపంలో చెల్లిస్తే.. మెషీన్ కింది భాగంలో మనము ఎంపిక చేసుకున్న బ్రాండ్‌కు సంబంధించిన మద్యం సీసా బయటకు వస్తుంది.
ఈ విధానం దుకాణాల్లోని కౌంటర్లలో అధిక ఛార్జీల వసూలును అరికట్టడానికి సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆటోమేటిక్ లిక్కర్ డిస్పెన్సింగ్ మెషీన్ల ఏర్పాటు పైలట్ ప్రాతిపదికన జరుగుతోందని వెల్లడించాయి. ఇతర ప్రదేశాల్లో దీని అమలుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెషీన్ల ద్వారా ఎమ్మార్పీ రేట్లకు మాత్రమే మద్యాన్ని విక్రయిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ మెషీన్ల ఏర్పాటుతో మద్యం దుకాణాలు మూసివేస్తారన్న ఆందోళన మందుబాబులకు ఇక లేనట్లే. ప్రస్తుతం ఈ మెషీన్ల వద్ద మందుబాబులు క్యూ కడుతున్నారు. ఆటోమేటిక్ లిక్కర్ డిస్పెన్సింగ్ మెషీన్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
A liquor vending machine that has been introduced by Tasmac in Chennai. This is at an Elite Shop inside a mall @THChennai pic.twitter.com/gZlb1D3Gnt
— Sangeetha Kandavel (@sang1983) April 28, 2023
Also Read..
Bajrang Punia | ఢిల్లీ పోలీసులు రెజ్లర్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు : బజరంగ్ పునియా
Priyanka Gandhi | రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించిన ప్రియాంక గాంధీ