Hyderabad | సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. శనివారం ఉదయం హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.
వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని.. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు.
సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్లోనూ రద్దీ పెరిగింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం జనాలు బారులు తీరారు. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. జనగామ బస్సు కోసం దాదాపు గంటన్నర ఎదురుచూస్తే ఒక్క బస్సు వచ్చిందని.. స్పెషల్ బస్సు పేరిట అందులోనూ రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర వాసులు
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపైనా భారీగా ట్రాఫిక్ జామ్
టోల్ గేట్ల వద్ద రెండు గంటల సమయం pic.twitter.com/kxxEbz1dPm
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026