Almont Kid Syrup | ఆ సిరప్‌ను వాడటం నిలిపివేయండి.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆదేశాలు
Almont Kid Syrup | పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది.
Almont Kid Syrup | పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది.
బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL 24002 బ్యాచ్ సిరప్‌ల్లో కల్తీ జరిగిందని పశ్చిమ బెంగాల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేషన్ నుంచి హెచ్చరికలు అందాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే.. వాడకం ఆపేయాలని.. అలాగే మార్కెట్లోనూ విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం ఆదేశించారు. పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాడకూడని సిరప్ వివరాలివే..
మందు పేరు: Almont-Kid Syrup
బ్యాచ్ నం: AL-24002
తయారీ తేదీ: Jan-2025
గడువు తేదీ: Dec-2026
దీనిపై సమాచారం లేదా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1800-599-6969లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

