OTT Weekend Movies | ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. సంక్రాంతి సందడి కంటే ముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త చిత్రాల జాతర మొదలైంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ మరియు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’ వంటి చిత్రాలు ఈ వీకెండ్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలను ఒకసారి చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్
అఖండ 2 (Akhanda 2): బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ఈ భారీ సీక్వెల్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
దే దే ప్యార్ దే 2 (Hindi): అజయ్ దేవగన్ నటించిన రొమాంటిక్ కామెడీ ప్రస్తుతం హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.
హిస్ & హర్స్ (English Series): తెలుగు, తమిళ, హిందీ ఆడియోలతో అందుబాటులో ఉంది.
షీబోయుగి (Japanese): డెత్ గేమ్స్ నేపథ్యంలో సాగే ఆసక్తికర చిత్రం.
ది రూకీ (S7), సోల్ ఆన్ ఫైర్ (English): ఇంగ్లీష్ వెబ్ సిరీస్
ప్రైమ్ వీడియో
జిగ్రీస్ (Jigris): నలుగురు స్నేహితుల గోవా ట్రిప్ చుట్టూ తిరిగే క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. (తెలుగు)
ఎల్లో (Yellow): తమిళ చిత్రం.
ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (English): రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉంది.
ది నైట్ మేనేజర్ (English Series): జనవరి 11 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
సన్ నెక్స్ట్
జిగ్రీస్ (Telugu): ప్రైమ్ వీడియోతో పాటు ఇందులో కూడా అందుబాటులో ఉంది.
సైలెంట్ స్క్రీమ్స్ (Silent Screams): తెలంగాణలోని అదృశ్యమవుతున్న అమ్మాయిల నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీ.
అంగమ్మాళ్ (Tamil): ఒక మధ్య వయస్కురాలైన మహిళ కథతో సాగే సోషల్ డ్రామా.
రాధేయ (Kannada): కన్నడ యాక్షన్ చిత్రం.
జియో హాట్‌స్టార్
ట్రాన్: ఏరెస్ (English, Telugu, Hindi): ఇంగ్లీష్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
వెపన్స్ (English): హారర్ థ్రిల్లర్ (తెలుగులోనూ అందుబాటులో ఉంది)
సోని లివ్
ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ (Season 2): భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో సాగే హిస్టారికల్ సిరీస్ (తెలుగులోనూ అందుబాటులో ఉంది).
ఈటీవీ విన్
కానిస్టేబుల్ కనకం (Season 2): వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో సాగే ఇన్వెస్టిగేషన్ సిరీస్ (మొదటి 4 ఎపిసోడ్లు).
మళ్ళీ వచ్చిన వసంతం: ఒక ఫీల్ గుడ్ తెలుగు సినిమా.
ఆహా
అయలాన్ : శివకార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పుడు తెలుగు వెర్షన్లో ఆహాలో అందుబాటులోకి వచ్చింది.