Srinivasa Mangapuram | టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో కొత్త హీరో ఎంట్రీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాకు ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సంచలన విజయాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కల్ట్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను మహేష్ బాబు స్వయంగా విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్‌పై దూసుకెళ్తూ, కాస్త వంగి తుపాకీతో కాలుస్తున్నట్లుగా కనిపిస్తున్న జయకృష్ణ లుక్ స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెటిజన్లు “ఘట్టమనేని వారసుడి ఇంటెన్స్ ఎంట్రీ”, “అజయ్ భూపతి టచ్ స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమని తెలుస్తోంది. అజయ్ భూపతి సినిమాలకు ఉండే ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్, రా ప్రెజెంటేషన్ ఈ చిత్రంలోనూ కనిపించనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. హీరోగా తొలి సినిమాతోనే జయకృష్ణకు బలమైన పాత్ర, డిఫరెంట్ షేడ్‌లో క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్లో ఆమెకు ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. జయకృష్ణ–రాషా తడాని కాంబినేషన్ కొత్తగా ఉండటంతో పాటు, కథకు కొత్త ఫ్రెష్‌నెస్ తీసుకువస్తుందనే టాక్ వినిపిస్తోంది.
చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. ఇక సంగీత బాధ్యతలను టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని భావిస్తున్నారు. మొత్తానికి, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ, అజయ్ భూపతి దర్శకత్వం, పవర్ఫుల్ ఫస్ట్ లుక్ అన్నీకలసి ‘శ్రీనివాస మంగాపురం’పై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమా ద్వారా జయకృష్ణ టాలీవుడ్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.