Tamil Nadu : తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో ఆధిక్యాలు వెలువడుతున్నాయి. కొళత్తూరు (Kolatthur) లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin) ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఎడప్పాడిలో ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswamy), పెరంబూరులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay), చేపాక్కం-తిరువల్లికేణిలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇలా ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఆధిక్యంలోనే ఉండటం గమనార్హం.
ఇక తమిళనాడు అధికార డీఎంకే పార్టీనే వరుసగా రెండోసారి విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే ఒకటిరెండు సర్వేలు మాత్రం విజయ్ నేతృత్వంలో టీవీకే భారీగా సీట్లు గెలుచుకుంటుందని తెలిపాయి. టీవీకే పార్టీ కింగ్‌గా, లేదంటే కింగ్ మేకర్‌గా నిలుస్తుందని వెల్లడించాయి. దాంతో తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఎర్లీ ట్రెండ్స్ మాత్రం డీఎంకేనే మళ్లీ విజయం సాధించబోతోందనే సంకేతాలు ఇస్తున్నాయి.