తమిళనాడులో కుండపోత వర్షాలు.. మరో రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
Tamil Nadu Rains | తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని
చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పుదుచ్చేరి రాష్ట్రం అంతటా, తమిళనాడులో రాజధాని చెన్నైతోపాటు దాని పరిసరాల్లో 22 జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దాంతో రెండు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో కూడా కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తమిళనాడులో వచ్చే ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు చెన్నై సహా 22 జిల్లాలను అప్రమత్తం చేసింది. చెంగల్పేట్, శోలింగనల్లూర్, కేలంబాక్కమ్ నగరాల్లో 4 సెంటీమీటర్ల చొప్పున, అన్నా యూనివర్సిటీ, తంబారమ్ నగరాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా.. మామల్లపురంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
కాగా, ఇవాళ నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండిగుల్, థేని జిల్లాలతోపాటు, రాజధాని చెన్నైలోని తొండియార్‌పేట్, వేలచేరి, వండల్లూర్, వలజాబాద్, నెమిలి, అరక్కోనమ్ ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Colleges
- Puducherry
- schools
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

