చెన్నై : కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మరో యుద్ధానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తమిళనాడులో ఇక హిందీ మాటే వినిపించకూడదు, కనిపించకూడదన్న ఉద్దేశంతో హిందీ భాష వాడకంపై నిషేధం విధించడానికి డీఎంకే సర్కార్ సిద్ధమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా హిందీ హోర్డింగులు, హిందీ సినిమాలు, హిందీ పాటలపై నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అయితే బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం.