చెన్నై: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తమిళనాడు ప్రభుత్వం పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్రం ఇప్పుడు మరిన్ని కఠిన నిర్ణయాలు చేసింది. ఈ ఆదివారం కంప్లీట్ లాక్డౌన్ విధించింది. దాంతో రాజధాని చెన్నై సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
అంతేగాక సోమవారం నుంచి అమల్లోకి వచ్చేలా పలు నూతన మార్గదర్శకాలు చేసింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, స్పాలు, బార్బర్ షాపులు మూతపడనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపుల నుంచి కేవలం పార్సిల్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో ప్రజల ప్రవేశానికి అనుమతులు నిరాకరించనున్నారు.
Chennai: Tamil Nadu imposes lockdown on Sunday, with some exceptions, to curb the spread of COVID19
— ANI (@ANI) April 25, 2021
From Apr 26th, beauty parlors, salons, spas, barber shops to be closed, only takeaway allowed in hotels, restaurants & tea shops. All places of worship to be closed for the public pic.twitter.com/thJ2g24GXC
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత