RN Ravi | దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) పట్టాలెక్కాయి. ఇవాళ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వర్చువల్ విధానంలో ఈ మూడు రైళ్లను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన రైళ్లు మీరట్-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్ మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి (RN Ravi ) పాల్గొన్నారు. చెన్నై ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ రైల్లో ప్రయాణించేందుకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికారు. ప్రతి విద్యార్థికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించారు. విద్యార్థుల పేరు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, దేశంలో ఇప్పటికే 51 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ లాంచ్ చేసిన మూడు రైళ్లతో కలిపి వాటి సంఖ్య 54కు పెరిగింది.
#WATCH | Tamil Nadu Governor RN Ravi welcomed the students who came to experience the Vande Bharat Train travel from Chennai MGR Central railway station.
PM Modi flagged off three Vande Bharat trains on three routes: Meerut – Lucknow, Madurai – Bengaluru and Chennai – Nagercoil pic.twitter.com/yU1rHjHduq
— ANI (@ANI) August 31, 2024
Also Read..
PM Modi | మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళనకరం.. ఈ కేసుల్లో సత్వర న్యాయం జరగాలి : ప్రధాని మోదీ
Pune | వడపావ్ తినేందుకు స్కూటీ ఆపి.. రూ.5లక్షల విలువైన నగలు పోగొట్టుకున్న వృద్ధ జంట
Donald Trump | ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం.. స్టేజ్‌వైపు దూసుకొచ్చిన దుండగుడు