Donald Trump | ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం.. స్టేజ్‌వైపు దూసుకొచ్చిన దుండగుడు
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది. శుక్రవారం పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గత నెల 16వ తేదీ కూడా ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్(78) మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఈ ఘటనలో ప్రచార సభకు హాజరైన ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్ ఒకరు కాల్చి చంపేశారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్‌పై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ భద్రతపై రిపబ్లికన్ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
X Banned: బ్రెజిల్లో సోషల్ మీడియా ‘ఎక్స్’పై నిషేధం
Telangana | రాష్ట్రంలో పలు జిల్లాల్లో దంచికొడుతున్న వాన.. ఉమామహేశ్వర క్షేత్రాన్ని చుట్టుముట్టిన వరద
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

