Farmers | మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో రైతులు (Farmers) చేపట్టిన ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఇవాళ సరిహద్దుల్లో ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఖనౌరీ, శంభు, రతన్‌పురా సరిహద్దుల్లో నిరసన చేపట్టాలని యోచిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ నిరసనల్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) కూడా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నిరసనను శాంతియుతంగానే నిర్వహిస్తున్నామని రైతు సంఘాల నేతలు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. తమ డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నిరసనలు 200 రోజులు పూర్తి చేయడం ఓ మైలురాయిగా రైతు నేతలు అభివర్ణించారు. అదేవిధంగా ఇటీవలే రైతుల ఉద్యమాన్ని బంగ్లాదేశ్ పరిస్థితులతో పోల్చిన బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా త్వరలో జరగబోయే హర్యానా ఎన్నికలకు తమ వ్యూహాన్ని వెల్లడిస్తామని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తమ తదుపరి చర్యలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Telangana | రాష్ట్రంలో పలు జిల్లాల్లో దంచికొడుతున్న వాన.. ఉమామహేశ్వర క్షేత్రాన్ని చుట్టుముట్టిన వరద
Samantha | హేమ కమిటీ రిపోర్ట్‌ను స్వాగతించిన సమంత.. తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి
Hyderabad | హైదరాబాద్ పబ్బులపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్