Samantha | మలయాళ సినీరంగంలో (Malayalam cinema) మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక (Hema commission report) అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లలో కనీన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మరోసారి స్పందించారు. హేమ కమిటీ రిపోర్ట్‌ను స్వాగతించారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యుసీసీ) ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) సామ్ కీలక విజ్ఞప్తి చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ రిపోర్ట్‌ను స్వాగతిస్తున్నాం. డబ్ల్యూసీసీని స్ఫూర్తిగా తీసుకొని.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ 2019లో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ ఏర్పాటైంది. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని సామ్ ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, ఈ రిపోర్ట్‌పై సమంత ఇప్పటికే తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) అద్భుతమైన పనితీరును తాను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నట్లు సమంత తెలిపారు. డబ్లూసీసీ వల్లే హేమ కమిటీ నివేదిక ఇవ్వగలిగిందని, చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బయటకు వచ్చాయన్నారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలని సామ్ అభిప్రాయపడ్డారు. వీటికోసం ఇప్పటికీ ఎంతో మంది పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అయిననప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని, కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై తగిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్ల్యూసీసీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడించారు.
అమ్మ అసోసియేషన్‌కు మోహన్‌లాల్ రాజీనామా
హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam 85201Movie Artists) అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఆయనతో పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు నెలల్లోగా కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘అమ్మ’ సంఘంలో సభ్యులుగా ఉన్న దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజారమూడులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక :
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఆ అంశాన్ని స్టడీ చేసేందుకు కేరళ సర్కారు హేమా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమా ఆ కమిషన్‌కు నాయకత్వం వహించారు. నటి శారదతోపాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆ కమిషన్ ఇటీవలే తన నివేదికను సీఎం విజయన్‌కు సమర్పించింది.
మలయాళ చిత్రం0స్తున్నదని పేర్కొన్న కమిటీ.. లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని వెల్లడించింది. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ మధ్య ఒప్పందం ఉన్నదని కమిటీ నివేదిక ఆరోపించింది. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read..
Hyderabad | హైదరాబాద్ పబ్బులపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
Harish Rao | ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా?: హరీశ్‌రావు