హైదరాబాద్: గృహజ్యోతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ఇప్పటికే ఆ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారని, వాస్తవానికి మాత్రం పేదల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు.
జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట అంటూ దుయ్యబట్టారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
తూతూ మంత్రంగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకాన్ని పూర్తిగా అటకెక్కిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ.. వాస్తవానికి మాత్రం పేదల నుండి బిల్లులు వసూలు చేస్తున్నారు.
జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో పేదల నుండి పెండింగ్… pic.twitter.com/RcxvNI2UOu
— Harish Rao Thanneeru (@BRSHarish) August 31, 2024