చెన్నై, మే 14: తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అందుకుంటున్న డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి సవరిస్తున్నామని, ఇది ఈ ఏడాది జనవరి 1 వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నది.
అలాగే మద్యం అమ్మకాల్ని నియంత్రిస్తూ సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 21 ఏండ్ల వయసు నిబంధనను కఠినంగా అమలుజేయాలని ఆదేశాలు జారీ చేశారు.