CJP Protests: సీజేపీ ఆందోళనకు విదేశీ నిధులు.. ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్
CJP Protests: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ.. సంసద్ చలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి భారీగా విదేశీ నిధులు అందినట్లు తెలిసింది. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టాలని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆ పిల్‌పై విచారణ చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో ‘చలో పార్లమెంట్'(CJP Protests) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసన వెనుక భారీ కుట్ర ఉన్నట్లు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ‘సంసద్ చలో’ నిరసనల కోసం విదేశీ నిధులు అందినట్లు ఆ పిటీషన్లో తెలిపారు. అయితే తక్షణమే విదేశీ నిధులపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టాలని పిటీషన్లో కోరారు. శుక్రవారం ఆ పిల్‌పై విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. అడ్వకేట్ బారున్ కుమార్ సిన్హా ఆ పిటీషన్‌పై వాదించనున్నారు. సతీశ్‌కుమార్ అగర్వాల్ ఆ పిటీషన్ ఫైల్ చేశారు.
‘సంసద్ చలో’ నిరసన వల్ల దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ జనజీవితం స్తంభించిపోయినట్లు ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. నీట పేపర్ లీకేజీ అంశంతో ప్రారంభమైన నిరసన ఆ తర్వత రాజకీయ మలుపు తీసుకున్నదని, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారని, దీని వల్ల ఢిల్లీ స్తంభించిపోయినట్లు పిటీషన్లో సిన్హా పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆ ధర్నాకు మద్దతు ఇచ్చారని, కానీ ఆయనకు విదేశీ సంస్థలతో లింకులు ఉన్నాయని పిల్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

