పుణె: దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. రకరకాల వినాయకుడి విగ్రహాలు(Ganesh Idol) అలరిస్తున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో గణేశోత్సవం సందర్భంగా పానీపురిలతో ఓ భారీ వినాయకుడిని చేశారు. ఆ గణేశుడు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాడు. పుణెలోని ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న గణేశ్ బేల్ షాపు ఓనర్లు పానీపురీలతో వినాయకుడిని రూపొందించారు. ఆ గణపతి 13 అడుగుల ఎత్తు ఉన్నాడు. సుమారు 21వేల పానీపురిలతో లంబోదరుడిని డిజైన్ చేశారు. రూపేశ్, దినేశ్ గుద్మేవర్ అనే ఇద్దరు కలిసి ఆ విఘ్నేశ్వరుడిని రూపొందించారు. ఎకో ఫ్రెండ్లీ రూపంలో ఈ వక్రతుండుడిని నిర్మించారు. గణేశ్ ఉత్సవాలు ముగిసిన తర్వాత నీటిలో నిమజ్జనం చేయడానికి బదులుగా 21వేల పానీపురిలతో ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ను తయారు చేయనున్నారు.
Ganpati idol made using 21,000 pani puris at FC Road in Pune pic.twitter.com/99y0GSkZXD
— Gaurav Kadam (@gauraavkadam) September 14, 2026