‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగం మరువలేనిది’
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగం మరువలేనిదని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, అన్నారం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవంలో...
– సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
తుంగతుర్తి, సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగం మరువలేనిదని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, అన్నారం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవంలో పాల్గొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దాయం రాజారెడ్డి, దొగ్గరి ముత్లింగం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పేదల హక్కుల కోసం, నైజాం రాచరిక వ్యవస్థ నిర్మూలన కోసం, గ్రామీణ భూస్వామ్య దొరల దౌర్జన్యాల అంతం కోసం జరిగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటంలో దాయం రాజిరెడ్డి పోరాట పటిమ మరువలేనిదఅన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ముత్తిలింగం చేసిన పోరాట పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాయం రాజిరెడ్డి మనవరాలు దాయం ఝాన్సీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లెంల యాదగిరి, బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు నండూరి కర్ణకుమారి, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారామ్, వెంపటి గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లయ్య, జిల్లా అధ్యక్షులు ఎడవల్లి శ్రీకాంత్, సిపిఐ మండల కార్యదర్శి పాల్వాయి, పున్నయ్య, నారాయణ, మల్లేష్, మురళి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Vijayasai Reddy | ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

